PRESIDENTIAL ORDER 2018 (PRESIDENT OF INDIA) (ప్రెసిడెన్సిల్ ఆర్డర్ 2018 ( భారత రాష్ట్రపతి )
1. పరిచయం
తెలంగాణ రాష్ట్రము:
2014, జూన్ 02 న, 10 పది జిల్లాలతో కూడిన నూతన తెలంగాణ రాష్ట్రము ఏర్పడినది. పరిపాలన సౌలభ్యం కోసం 10 పది జిల్లాలను 31 ముప్పైఒక్కటి జిల్లాలుగా మొత్తం 31 జిల్లాల ను ఏర్పాటు చేయటం జరిగిందఈవిధముగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వంనకు విన్నవించుకోవటం జరిగింది. దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరమైన హక్కులను కల్పిస్తూ తేదీ 29. 08.2018 రోజున భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గారు ప్రెసిడెన్సిల్ ఆర్డర్ 2018 ని ప్రకటించారు.
దీనికి అనుబంధముగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీ.ఓ.ఎం .స్. నంబర్. 124 ను తేదీ 30.08.2018. న విడదల చేయటం జరిగింది. ప్రెసిడెన్సిల్ ఆర్డర్స్ 2018 ప్రకారం 31 జిల్లాల 07 ఏడు, జోన్లు గా , 02 మల్టీ జోన్లుగా విభజించారు. అవి ఏమనగా :-
మల్టీ జోన్ I
జోన్ I - కాళేశ్వరం :-
కొమురంభీం -ఆసిఫాబాద్ , మాంచెరియల్ , పెద్దపల్లి, జయ శంకర్ భూపాలపల్లి, జిల్లాలు.
జోన్ II - బాసర :-
ఆదిలాబాద్ , నిర్మల్, నిజామాబాదు , జగిత్యాల జిల్లాలు.
జోన్ III - రాజన్న :-
కరీంనగర్, రాజన్న- సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు.
జోన్ IV - భద్రాద్రి :-
కొత్తగూడెం- భద్రాద్రి, ఖమ్మం, మహబుబాబాద్, వరంగల్, రూరల్ & అర్బన్ జిల్లాలు.
మల్టీ జోన్ -II
జోన్ V - యాదాద్రి :-
సూర్యాపేట, నల్గొండ, బోనగిరి - యాదాద్రి , జనగాన్ జిల్లాలు.
జోన్ VI చార్మినార్:-
మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి , సంగారెడ్డి జిల్లాలు.
జోన్ VII జోగులాంబ :-
వికారాబాద్, మహాబూబ్ నగర్, జోగులాంబ - గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలు.
PRESIDENTIAL ORDER 2021 AMENDED(PRESIDENT OFINDIA)
ప్రెసిడెన్సిల్ ఆర్డర్ 2021 సవరణ ( భారత రాష్ట్రపతి )
ప్రెసిడెన్సిల్ ఆర్డర్ 2021 సవరణ ప్రకారం:
ప్రెసిడెన్సిల్ ఆర్డర్ 2021 సవరణ ఇంకా 02 రెండు నూతన జిల్లాలు 1. ములుగు జిల్లా మరియు రెండవది 2.నారాయణపేట కలిపి మొత్తం 33 ముప్పై మూడు జిల్లాలతో కూడిన ప్రాంతంతో కలిపి ప్రెసిడెన్సిల్ఆర్డర్ 2021 సవరణ ను భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గారు ప్రెసిడెన్సిల్ ఆర్డర్ 2021 సవరణ తేదీ 16. ఏప్రిల్ 2021 న ప్రకటించారు. దీనికి అనుబంధముగా తెలంగాణ ప్రభుత్వం జీ.ఓ -128 (30.జూన్ . 2021) న విడదల చేసింది. ప్రెసిడెన్సిల్ ఆర్డర్స్ 2021 సవరణ ప్రకారం తెలంగాణ ప్రాంతాన్ని 33 జిల్లాలతో కూడిన , 07 ఏడు, జోన్లు గా, 02 మల్టీ జోన్లుగా విభజించారు.
అవి ఏమనగా :
మల్టీ జోన్ I
జోన్ I - కాళేశ్వరం :-
కొమురంభీం ఆసిఫాబాద్, మాంచెరియల్, పెద్దపల్లి, జయ శంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు .
జోన్ II - బాసర :-
ఆదిలాబాద్ , నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల జిల్లాలు.
జోన్ III - రాజన్న :-
కరీంనగర్, రాజన్న- సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు.
జోన్ IV - భద్రాద్రి :-
కొత్తగూడెం, ఖమ్మం, మహబుబాబాద్, వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాలు.
. మల్టీ జోన్ -II
జోన్ V - యాదాద్రి :-
సూర్యాపేట, నల్గొండ, బోనగిరి - యాదాద్రి, జనగామ, జిల్లాలు.
జోన్ VI చార్మినార్ :-
మేడ్చల్- మాల్కజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు.
జోన్ VII జోగులాంబ :-
మహబూబ్నగర్, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలు.
వికారాబాద్ జిల్లా :-
ప్రెసిడెన్సిల్ ఆర్డర్స్ 2018 ప్రకారం జోన్ VII జోగులాంబ లో వికారాబాద్ జిల్లాను ఉంచారు. మళ్లి ఆప్రాంత ప్రజల అభిప్రాయం మేరకు జోన్ VI చార్మినార్ లో వికారాబాద్ జిల్లాను చేర్చారు.
ముగింపు
తెలంగాణ రాష్ట్రము కొరకు "ప్రెసిడెన్షియల్ ఆర్డర్" అనేది 2018 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సూచిస్తుంది, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371-డి అమలుకు సంబంధించి జారీ చేయబడింది. ఆర్టికల్ 371-డి తెలంగాణ రాష్ట్రమున కు ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యలో సమాన అవకాశాలు మరియు సౌకర్యాల గురించి ప్రత్యేక నిబంధనలను అందిస్తుంది.
ఈ ఉత్తర్వులు రాజ్యాంగం మరియు సంబంధిత చట్టంలో వివరించిన విధంగా విద్య మరియు ఉద్యోగాలలో రిజర్వేషన్‌లకు సంబంధించిన సమస్యలతో సంబంధం కలిగి ఉంటాయి, ప్రత్యేకించి నిర్దిష్ట సమూహాలు లేదా ప్రాంతాలకు సంబంధించినవి.